‘హుషారు’ఫేం తేజాస్ కంచర్ల కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘ఉరుకు పటేల’. వివేక్‌రెడ్డి దర్శకుడు. కంచర్ల బాలభాను నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. హీరో తేజాస్ కంచర్ల పరుగెడుతుంటే, వెనుక ఎవరో కత్తిని విసిరేసినట్టు పోస్టర్లో కనిపిస్తున్నది.
మరోవైపు మంగళసూత్రం, పోస్టల్ బ్యాలెట్ పేపర్, పాల క్యాన్.. ఇవన్నీ పోస్టర్లో కనిపిస్తున్నాయి. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే భావోద్వేగ ప్రయాణమని, పోస్టర్ మాదిరిగానే సినిమా కూడా ఆసక్తిని రేకెత్తిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సన్నీ కూరపాటి, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, నిర్మాణం: లీడ్ ఎడ్జ్ పిక్చర్స్.