Tejaswini vygha | ఈ ఏడాది సెప్టెంబర్ 5న మూడు పండుగలు ఒకేసారి రాగా, దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. నేడు ఉపాధ్యాయ దినోత్సవం, మిలాద్-ఉన్-నబి, కేరళ రాష్ట్రంలో ఓనం.. ఈ మూడు వేడుకలు ఒకే రోజు రావడం విశేషం. ఇందులో ఓనం పండుగ కేరళలో చాలా ఫేమస్. కేరళలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ పండుగని మలయాళీలు చాలా సంతోషంగా జరుపుకుంటారు.అయితే ఈ పండుగ సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు భార్య తేజస్వినీ ఎంతో అందంగా ముస్తాబై సోషల్ మీడియాలో మెరిసింది. కేరళ ట్రెడిషనల్ వైట్ అండ్ గోల్డ్ చీరకట్టులో తేజస్వినీ ఆకట్టుకుంది. తన పండుగ లుక్ ఫొటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ, అందరికీ “ఓనం శుభాకాంక్షలు” తెలిపింది.
ఓనం పండుగను పురస్కరించుకుని పలువురు సినీ ప్రముఖులు కూడా బ్యూటీఫుల్ మూమెంట్స్ ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. తేజస్విని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. “అందం అంటే ఇదే”, “సింపుల్ అండ్ ఎలిగెంట్”, “మలయాళ అమ్మాయి అనిపిస్తోంది” అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. గతంతో పోలిస్తే తేజస్వినీ ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత యాక్టివ్గా మారింది. తన పర్సనల్ మరియు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తరచూ ఇన్స్టాగ్రామ్లో పంచుకుంటోంది.
ఓనం అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, అది కేరళ సంస్కృతి, సంప్రదాయం.ఇది మహాబలి చక్రవర్తి ఆగమనాన్ని స్వాగతించే సందర్భం. సంప్రదాయ వస్త్రధారణ, పూకలం (పూల ముగ్గులు), సద్య (విందు భోజనం)లతో మలయాళీలు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ విధంగా, దిల్ రాజు భార్య తేజస్వినీ తన ట్రెడిషనల్ లుక్తో ఓనం వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతంలో ఎక్కువగా భర్త దిల్ రాజు, తనయుడు అన్వి రెడ్డితో కలిసి దిగిన ఫోటోలు లేదా వీడియోలు షేర్ చేసేది తేజస్విని. కానీ ఇప్పుడు ఆవిడ పర్సనల్ ఫోటోలు ఎక్కువగా షేర్ చేస్తున్నారు.అవి తెగ వైరల్ అవుతున్నాయి.