‘జాంబీరెడ్డి’ సక్సెస్ తర్వాత హీరో తేజా సజ్జా, దర్శకుడు ప్రశాంత్‌వర్మ కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం ‘హను-మాన్’. కె.నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్‌ను శనివారం హీరో దుల్కర్ సల్మాన్ విడుదలచేశారు. సినిమా కోసం అంజనాద్రి అనే ఫాంటసీ ప్రపంచాన్ని చిత్రబృందం సృష్టించింది. ఇందులో హీరో తేజ చేసే విన్యాసాలతో ఫస్ట్ గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది. విభిన్నమైన వస్త్రధారణ, గెటప్‌లో తేజ కొత్తగా కనిపిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘సూపర్ హీరో కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. అంజనాద్రి ప్రపంచంలో హను-మాన్ చేసే సాహసాలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరిని అలరిస్తాయి. అతడి లక్ష్యమేమిటన్నది ఆకట్టుకుంటుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుతున్నాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర.