Teja Sajja | ప్రస్తుతం ‘మిరాయ్ ’ సినిమాతో పాన్ వరల్డ్ స్థాయిలో ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్న యంగ్ హీరో తేజ సజ్జ, తన నటనా ప్రయాణాన్ని బాలనటుడిగా ప్రారంభించిన విషయం తెలిసందే. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘చూడాలని ఉంది’ సినిమాతో తెరంగేట్రం చేసిన తేజ, ఆ తరువాత ‘ఇంద్ర’, ‘ఠాగూర్’ వంటి చిత్రాల్లో కూడా బాలనటుడిగా మెరిశాడు. ఈ చిత్రాల వల్ల తేజకి చిరంజీవితో మంచి బాండింగ్ ఏర్పడింది.బాల నటుడిగా తేజ ఉన్న సమయంలో ఆయన ప్రతి పుట్టిన రోజుని చిరు సెలబ్రేట్ చేసేవారట. ఈ విషయాన్ని తేజనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. చిరంజీవి బర్త్‌డే ఆగష్టు 22, తేజ బర్త్‌డే ఆగష్టు 23 కావడంతో చిరు మరిచిపోకుండా తేజను ప్రత్యేకంగా ఆహ్వానించి, కేక్ కట్ చేయించేవారట. అది ఇప్పటికీ నా జీవితంలో ఓ ప్రత్యేక జ్ఞాపకం అని తేజ అన్నారు.
అయితే తాజాగా మిరాయ్ ప్రమోషన్లో భాగంగా తేజ మాట్లాడుతూ.. ఇంద్రలో తనకి అవకాశం రావడం పట్ల స్పందించాడు. కొన్ని వందల ఫొటోల నుండి చిరంజీవి గారు నా ఫొటో పిక్ చేశారు. అలా నా జీవితం మారింది అని తేజ సజ్జా స్పష్టం చేశారు. తేజ నిన్నటితరం మెగా హీరోలందరి చిత్రాల్లో బాలనటుడిగా నటించాడు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ సినిమాల్లోనూ తేజ కనిపించాడు. చిరంజీవి నటించిన ‘చూడాలని ఉంది’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి యాక్టింగ్ కెరీర్ ని స్టార్ట్ చేసాడు తేజ సజ్జ. ఇక సమంత ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబీ చిత్రంతో తేజ సజ్జా హీరోగా వెండితెర నటించారు. ఆ తర్వాత జాంబీ రెడ్డి సినిమాలో నటించి నటుడిగా ప్రశంసలు అందుకున్నారు.
ఆ తర్వాత ఇష్క్, అద్భుతం చిత్రాలు థియేటర్లలో కమర్షియల్ హిట్ అందుకోలేకపోయాయి. చివరిగా హనుమాన్ చిత్రంలో నటంచి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ఇక ఇప్పుడు మిరాయ్తో అద్భుతం చేయబోతున్నాడు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ రోజు గోకుల్ పార్క్ బీచ్, వైజాగ్‌లో మిరాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు.