Mirai | హనుమాన్ ఫేం తేజసజ్జా (Teja Sajja) హీరోగా నటిస్తున్న చిత్రం మిరాయి (Mirai). ఈ పాన్ ఇండియా అడ్వెంచరస్ మూవీకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ఢిల్లీ బ్యూటీ రితికా నాయక్ (Ritika Nayak) ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. మంచు మనోజ్ (Manchu Manoj) కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వైబ్ ఉంది విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతోంది.
వైబ్ ఉంది సాంగ్‌తో సక్సెస్‌ఫుల్‌గా మ్యూజికల్ జర్నీ షురూ చేసింది మిరాయి. ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతూ అన్ని భాషల్లో 15 మిలియన్లకుపైగా వ్యూస్ రాబట్టింది. సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్లో తేజ సజ్జా, రితికా నాయక్ రొమాంటిక్ ఫోజుతో ఈ మెలోడీ ట్రాక్‌పై హైప్ క్రియేట్ చేశారు.
ఈ మూవీని 2025 సెప్టెంబర్ 5న పలు భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తుండగా.. గౌరా హరి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ 2డీ, 3డీ వెర్షన్లలో ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుందని వస్తున్న వార్తలపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మేకర్స్ ఇప్పటికే షేర్ చేసిన మిరాయి టైటిల్ గ్లింప్స్ వీడియోకు మంచి స్పందన వస్తోంది.