Teja Sajja | సూపర్‌హీరో కాన్సెప్ట్‌తో ‘హను-మాన్’ఫేం తేజ సజ్జా నటిస్తున్న సినిమా ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ పానిండియా మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో తేజ సజ్జా సూపర్ యోధ పాత్రలో కనిపించనున్నారు. ఆగస్ట్ 1న ఎనిమిది భాషల్లో 2డి, 3డి ఫార్మాట్లలో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయనున్నట్టు శనివారం మేకర్స్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. రక్షబంధన్, స్వాతంత్య్ర దినోత్సవం దగ్గరగా వస్తున్న సందర్భంలో ‘మిరాయ్’ సందడి చేయనున్నదని వారు తెలిపారు.
ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్ని విడుదల చేశారు. మంచు పర్వతాల మధ్య నిలబడి, ఒక కర్రను పట్టుకుని, ఆవేశంగా చూస్తున్న తేజా సజ్జాను ఈ పోస్టర్లో చూడొచ్చు. మంచు మనోజ్ ఇందులో విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గౌరహరి, మాటలు: మణిబాబు, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, స్క్రీన్‌ప్లే, ఛాయాగ్రహణం, దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని.