Teja Sajja | యువ నటుడు తేజ సజ్జ (Teja Sajja) ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ‘మిరాయ్’ (Mirai). ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీ.జీ. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నాడు. రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా.. మంచు మనోజ్, శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పురాణాల ప్రకారం, అశోక చక్రవర్తి కళింగ యుద్ధం తర్వాత పశ్చాత్తాపంతో తొమ్మిది పవిత్ర గ్రంథాలను సృష్టించాడు. ఈ గ్రంథాలను కాపాడే యోధుల్లో ఒకడిగా తేజ సజ్జ కనిపించనున్నారు. ఈ గ్రంథాలను దక్కించుకోవడానికి ప్రయత్నించే దుష్టశక్తిని (మంచు మనోజ్) అతను ఎలా ఎదుర్కొంటాడనేది ఈ సినిమా కథ. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే నేడు తేజ సజ్జా బర్త్‌డే కానుకగా మూవీ నుంచి మిరాయ్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో తేజ సూపర్ యోధగా మారడానికి ఎలా కష్టపడ్డాడో చూయించారు మేకర్స్.