Teenmar savitri | గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాని ఎంత షేక్ చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా నా అన్వేషణ ఫేం అన్వేష్ పలువురు సెలబ్రిటీలని టార్గెట్ చేస్తూ వారిపై ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్గా ఆలీపై సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఇప్పుడు బిగ్‌బాస్ కంటెస్టెంట్, యాంకర్ శివజ్యోతి అలియాస్ తీన్మార్ సావిత్రిపై అన్వేష్ వీడియో చేసి పలు ఆరోపణలు చేశారు. ఒకప్పుడు నెలకు రూ.8 వేల వేతనానికి ఉద్యోగం చేసిన శివజ్యోతికి ఇప్పుడు హైదరాబాద్‌లో రూ.5 కోట్ల విలువైన అపార్ట్మెంట్, లగ్జరీ కారు, సొంతూరిలో హైవే పక్కన 10 ఎకరాల విలువైన స్థలం ఎలా వచ్చాయంటూ ఆరోపిస్తున్నాడు.
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం ద్వారా శివజ్యోతక్క కోట్లు సంపాదించిందని, బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బుతోనే తన భర్తతో కలిసి ఫారిన్ ట్రిప్స్ వెళుతుందుంటూ అన్వేష్ పేర్కొన్నాడు. బెట్టింగ్ యాప్స్ వలన అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటే శివజ్యోతి మాత్రం తన భర్తతో కలిసి జల్సాలు చేస్తుందంటూ నా అన్వేషణ ఫేం అన్వేష్ అంటున్నాడు. . 2024లో బెట్టింగ్ యాప్స్ వల్ల 1200 మంది చనిపోతే వీరిలో 200 మంది శివజ్యోతి వల్లే చనిపోయారంటూ అన్వేష్ ఆరోపించాడు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసి కోట్లు సంపాదించిన శివజ్యోతిని విచారించి ఆమె నుండి తిరిగి డబ్బూలు వసూలు చేయాలని రేవంత్‌కి విజ్ఞప్తి చేశాడు.
పేదరికం నుంచి వచ్చిన శివజ్యోతికి పేదల కష్టం తెలుసు కదా, మరి అలాంటి ఆమె ఇల్లిగల్ బెట్టింగ్ యాప్స్‌ను ఎలా ప్రమోట్ చేశావంటూ అన్వేష్ విరుచుకుపడ్డాడు. తప్పు ఎవరు చేసిన తప్పే అని బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ప్రతీ ఒక్కరికీ శిక్ష పడాల్సిందే అంటూ అన్వేష్ చెప్పుకొచ్చాడు. ఇలాంటి పనులను జ్యోతక్క మానేయాలని హెచ్చరించాడు. కాగా, విశాఖ ప్రాంతానికి చెందిన అన్వేష్.. నా అన్వేషణ పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించి పలు దేశాలలో టూర్లు చేస్తూ అక్కడి సంస్కృతి సాంప్రదాయాలు, ఆహారం, జీవన విధానాలు, వింతలు, విడ్డూరాలను పంచుకుంటూ కోట్లలో ఫాలోవర్స్ సంపాదించుకున్నారు. నెలకు లక్షల్లో సంపాదిస్తూ ఉంటున్న ఆయన రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలని టార్గెట్ చేస్తున్నాడు.