రవిప్రకాశ్‌రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యారెడ్డి ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం ‘6జర్నీ’. బసీర్ అలూరి దర్శకుడు. పాల్యం రవిప్రకాశ్‌రెడ్డి నిర్మాత. సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమైన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. అందరూ ప్రాణం పెట్టి పనిచేసిన సినిమా ఇదని, సాంకేతికంగా కూడా సినిమా అభినందనీయంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు.
సినిమా బాగా వచ్చిందని, దర్శకుడు బసీర్ బాగా తీశారని, అందరికీ నచ్చే సినిమా అవుతుందని నిర్మాత తెలిపారు. ఇంకా ఇందులో నటీనటులతోపాటు అతిథులుగా విచ్చేసిన రమేశ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: టి.సురేందర్‌రెడ్డి, సంగీతం: ఎం.ఎన్.సింహా, సమర్పణ: పాళ్యం శేషమ్మ, బసిరెడ్డి, నిర్మాణం: అరుణకుమారి ఫిలింస్.