Dhanunjaya Birthday | ‘పుష్ప’ (Pushpa) చిత్రంలో కన్నడ స్టార్ నటుడు ధనుంజయ (Dhanunjaya) పోషించిన జాలిరెడ్డి (Jolly reddy) పాత్ర అందరికి గుర్తుండిపోయింది. పుష్ప కారణంగా జాలిరెడ్డి మంచానికి పరిమితం కాగా, సెకండ్ పార్ట్ (Pushpa 2) లో జాలిరెడ్డి కూడా భన్వర్ సింగ్ షెకవాత్ (Bhanvar Singh Shekavath) తో చేయి కలిపి పుష్పపై పగ తీర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ‘పుష్ప-2’లో కూడా ధనుంజయ పాత్ర కీలకంగా ఉండబోతున్నదని సమాచారం. కాగా బుధవారం ధనుంజయ పుట్టిన రోజు సందర్భంగా ‘పుష్ప 2’ నుంచి జాలిరెడ్డి లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తూ మేకర్స్ బర్త్ డే విషెస్‌ను తెలియజేశారు.
స్టైలిష్‌గా కనిపిస్తున్న జాలిరెడ్డి లుక్ ఆకట్టుకునేలా ఉంది. అలాగే ఈ చిత్రంలో జాలిరెడ్డి క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలియజేశారు మేకర్స్. ఈసారి జాలిరెడ్డి తన బాకీ తీర్చుకునేందుకు వస్తున్నాడు అంటూ ధనుంజయ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటున్నది.
సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ ప్యాన్ ఇండియా మూవీని డైరెక్టర్ సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
Team #Pushpa2TheRule wishes the talented @Dhananjayaka a very Happy Birthday ❤️🔥
Jolly Reddy will be back to settle the scores this time 💥
Icon Star @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP #FahadhFaasil @SukumarWritings @PushpaMovie @TSeries pic.twitter.com/pw8MkpvdvD
— Mythri Movie Makers (@MythriOfficial) August 23, 2023