Tarzan Hero Ron Ely | హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాలీవుడ్ సిరీస్ టార్జాన్ నటుడు రాన్ ఎలీ (Ron Ely) కన్నుమూశారు. ప్రస్తుతం ఇతడి వయసు 86. అనారోగ్యంతో బాధపడుతున్న రాన్ ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా, రాన్ ఎలీ మరణం హాలీవుడ్ సినీ పరిశ్రమకు తీరని లోటు అని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఇండస్ట్రీలోని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
అయితే రాన్ ఎలీ చనిపోయిన అనంతరం తన కూతురు కిర్‌స్టెన్ ఎలీ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఈ ప్రపంచం తనకు తెలిసిన గొప్ప వ్యక్తులలో ఒకరిని కోల్పోయింది. అలాగే నేను నా తండ్రిని కోల్పోయాను. మా నాన్నని అందరు హీరో అని పిలిచేవారు. ఆయన నటుడిగా, రచయితగా, కోచ్‌గా, గురువుగా, కుటుంబ వ్యక్తిగా, నాయకుడిగా రాణించిన వ్యక్తి. అతడు ఏ రంగంలోకి వెళ్లిన అక్కడ తన మార్క్‌ను చూపించడమే కాకుండా.. పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేసేవారు. అతను ఇతరులపై చూపిన ప్రభావం నేను మరే వ్యక్తిలోనూ చూడనిది. అతనిలో నిజంగా ఏదో అద్భుతం ఉంది. ఆయన మరణం మా కుటుంబానికి తీరని లోటు అంటూ కిర్‌స్టెన్ ఎలీ రాసుకోచ్చింది.