TarunBhascker | దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యువ సంచలనం తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతి’. మలయాళంలో వచ్చిన జయ జయ జయ జయహే సినిమాకు రీమేక్‌గా రాబోతుంది ఈ చిత్రం. ఈ సినిమాకు ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహిస్తుండగా.. సృజన్ యారబోలు, ఆదిత్య పిట్టే సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. కామెడీ కథాంశంతో ఈ సినిమా రాబోతుండగా ప్రస్తుతం టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.