Tharun Bhascker | టాలీవుడ్ యువ దర్శకుడు ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘కీడా కోలా’ వంటి విభిన్న చిత్రాలతో తనదైన ముద్ర వేసిన తరుణ్ భాస్కర్ చాలా రోజులకు కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. తన కెరీర్లో మర్చిపోలేని చిత్రంగా నిలిచిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు సీక్వెల్‌ను తీసుకురాబోతున్నట్లు ప్రకటించాడు. ఈNఈ రిపీట్ (ENERepeat) అంటూ రాబోతున్న ఈ చిత్రంలో ఫస్ట్ పార్ట్‌లో నటించిన నటులు విశ్వక్ సేన్‌తో పాటు అభినవ్ గోమఠ, సుశాంత్ రెడ్డి, వెంకటేశ్ కాకుమన్ ఈ సినిమాలో కూడా లీడ్ రోల్స్‌లో నటించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను సురేష్ ప్రోడక్షన్ బ్యానర్‌పై దగ్గుబాటి సురేష్ బాబు, సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మించబోతున్నారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్‌కి ఉన్న విపరీతమైన పాపులారిటీ ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
From:
Bro this is our vibeTo:
Bro it’s happening again 😭The Most iconic Kanya Raasi gang is BACK ❤️#ENERepeat #ENE pic.twitter.com/VXj4kDrMEu
— ENE Repeat (@ENERepeat) June 29, 2025