ఏడాదికి ఓ సినిమాను అభిమానులకు అందించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు ఎన్టీఆర్. ఆయన నటిస్తున్న బాలీవుడ్ పానిండియా మల్టీస్టారర్ ‘వార్ 2’ ఈ ఏడాది ఆగస్ట్ 14న విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 90 శాతం పూర్తయింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇందులో తారక్ క్యారెక్టర్ గురించి బీటౌన్‌లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో తారక్‌ది నెగెటివ్ షేడ్స్ ఉండే పాత్రని, హృతిక్ పాత్రకు ధీటుగా ఆయన పాత్ర ఉంటుందని తెలుస్తున్నది. ఇదిలావుంటే.. మరోవైపు ప్రశాంత్‌నీల్ ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్‌ను కూడా మొదలుపెట్టేశారు ఎన్టీఆర్.
ఇటీవలే మంగుళూరులో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. తారక్ కూడా షూట్లో పాల్గొన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘దేవర – 2’ను కూడా పట్టాలెక్కించే పనిలో ఉన్నారట తారక్. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తి కావొచ్చింది. తొలిపార్ట్ని మించేలా అద్భుతమైన స్క్రిప్ట్‌ని దర్శకుడు కొరటాల శివ సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది మార్చి నుంచి మొదలుపెట్టనున్నారట. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. అనిరుధ్ సంగీత దర్శకుడు. ఈ విధంగా వరుసగా సినిమాలు చేస్తూ మంచి జోష్ మీదున్నారు తారక్.