Devara 2 Movie | ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం దేవర. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి భాగం హిట్ కావడంతో రెండో భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న తారక్ తాజాగా దేవర పార్ట్ 2కి సంబంధించి అప్డేట్ ఇచ్చాడు.
దేవర 2 ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఫస్ట్ పార్ట్ మంచి విజయం సాధించడంతో మా బాధ్యత మరింత పెరిగింది. ‘దేవర’ కంటే దేవర 2 ఇంకా బాగుంటుంది. ఫస్ట్ పార్ట్ షూటింగ్ సమయంలోనే సెకండ్ పార్ట్‌కి సంబంధించిన షూట్‌ని కొంతవరకు కంప్లీట్ చేశాం. ఇది ఇంకా బాగా రావడానికి.. అలాగే ప్రేక్షకులకు నచ్చేలా చేయడానికి కొంత సమయం తీసుకోవాలి అనుకుంటున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించిన స్టోరీ కూడా రెడీ అయ్యింది. అయితే ఈ సినిమా కోసం కొరటాల శివ చాలా కష్టపడ్డాడు. అందుకే కొన్నిరోజుల పాటు విశ్రాంతి తీసుకోమని.. అలాగే నీకు నచ్చిన ప్రాంతానికి వెళ్లి ఎంజాయ్ చేసి రమ్మన్నాను. అతడు రాగానే పార్ట్ 2కి సంబంధించిన పనులను ప్రారంభిస్తాం అంటూ తారక్ చెప్పుకోచ్చాడు.