God Father | మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార చెల్లెలిగా కనిపించిన తాన్యా రవిచంద్రన్ గుర్తుందా? చిన్న పాత్రే కానీ గుర్తుండిపోయే రోల్లో కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది ఈ బ్యూటీ. తాన్యా..తెలుగులో ‘పేపర్ రాకెట్’ వెబ్ సిరీస్ ద్వారా, తమిళంలో పలు సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ కెరీర్లో ముందుకు సాగుతుంది. అయితే రీసెంట్గా ఈ ముద్దుగుమ్మ తన ప్రేమను సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.
“ఒక ముద్దు.. ఒక ప్రామిస్.. ఎప్పుడూ.. ఎప్పటికీ కలిసే.. అంటూ తను షేర్ చేసిన ఫొటోకి క్యాప్షన్‌గా జత చేసింది తాన్యా. ఆ ఫొటోలో తాన్యా తన ప్రియుడికి లిప్ లాక్ ఇస్తూ కనిపిస్తుంది. ఇదే ఫొటోతో పాటు “#SoonToBeMarried” అనే హ్యాష్‌ట్యాగ్ కూడా పెట్టడం ద్వారా పెళ్లికి సిద్ధమవుతున్నట్టు తెలిపింది. ఈ ప్రకటనతో ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ పలువురు సెలబ్రిటీలు కామెంట్లు చేస్తున్నారు. అయితే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం “ఇప్పుడే పెళ్లా?” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాన్యా మనసు దోచుకున్నవాడు మరెవరో కాదు. కోలీవుడ్‌కి చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గౌతమ్ జార్జ్.
ఇతను శంకర్ తీసిన ఐ, మదిల్ మేల్ కాదల్, అన్నాబెల్లే సేతుపతి వంటి చిత్రాలకు డీఓపీగా పని చేశారు. తమిళ పరిశ్రమలో మంచి క్రియేటివ్ టెక్నీషియన్‌గా పేరొందిన గౌతమ్.. త్వరలోనే తాన్యా మెడలో మూడు ముళ్లు వేయనున్నారు. మొత్తానికి తాన్యా – గౌతమ్ లవ్ స్టోరీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. త్వరలో వీరి పెళ్లి వేడుక జరుగబోతున్నట్టు తెలుస్తుండగా, ఈ వేడుకని గ్రాండ్‌గానే జరుపుకోవాలని ఈ జంట ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.