Tanushree Dutta Biggboss | బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా మరోసారి బీ టౌన్ వార్తల్లో నిలిచింది. ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ షోలో పాల్గోనడానికి వచ్చిన రూ.1.65 కోట్ల ఆఫర్‌ను తాను తిరస్కరించినట్లు తనుశ్రీ తెలిపింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న ఆమె ఈ విషయం గురించి మాట్లాడింది.
గత 11 ఏండ్లుగా ‘బిగ్ బాస్’ నిర్వాహకులు తనను షోలో పాల్గోనమని సంప్రదిస్తున్నారని తెలిపిన ఈ అమ్మడు. ఈ సీజన్ కోసం ఏకంగా రూ. 1.65 కోట్లు ఆఫర్ చేశారని వెల్లడించింది. అయితే నాతో పాటు మరో స్టార్ నటికి కూడా ఇంతే మొత్తంలో ఆఫర్ చేశారు. ఆ నటి షోలో పాల్గోంది. కానీ నాకు మాత్రం షోకి వెళ్లడానికి ఆసక్తి లేదని తనుశ్రీ చెప్పుకోచ్చింది. అంతేగాకుండా.. ఈ షోలో పాల్గొనకపోవడానికి మరో ముఖ్యమైన కారణం ఉందని తెలిపింది. ఈ షో కోసం ఒక పరాయి మగాడితో బెడ్ పంచుకునేంత చీప్ తాను కాదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. హౌస్‌లో ఆడ, మగ కలిసి ఒకే గదిలో ఒకే బెడ్‌పై పడుకోవడం జరుగుతుందని అది తనకు ఇష్టం ఉండదని పేర్కొంది. నా వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో నా సొంత కుటుంబంతోనే నేను కలిసి ఉండను అలాంటిది పరాయి వ్యక్తులతో ఎలా ఒకే బెడ్‌పై పడుకోంటాను అంటూ చెప్పుకోచ్చింది.
కెరీర్ విషయానికి వస్తే.. కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ అమ్మడు. బాలకృష్ణ సరసన నటించిన ‘వీరభద్ర’ (2006) ఆమె ఏకైక తెలుగు సినిమా. ఈ సినిమాలో ఆమె మాలతి అనే పాత్రలో నటించారు. ఈ సినిమాకు ఏ. ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించారు.