బాలీవుడ్లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా గట్టి పోరాటమే చేసింది నటి తనుశ్రీదత్తా. ‘మీటూ’ ఉద్యమంలో ఆమెది కీలక పాత్ర. అయితే గత కొన్నేళ్లుగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నది. తాజాగా తనుశ్రీదత్తా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్గా మారింది. తన సొంత ఇంట్లోనే వేధింపులు ఎదుర్కొంటున్నానని, తనకు సహాయం చేయాలని వీడియోలో ఆమె అభ్యర్థించింది. ‘ఈ విషయమై పోలీసులకు ఫోన్ చేశా. వారు మా ఇంటికి వచ్చి స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
రెండురోజుల్లో పోలీస్ స్టేషన్కు వెళ్లి కైంప్లెంట్ చేస్తాను. గత కొన్నేళ్లుగా ఆరోగ్యపరంగా కూడా సమస్యలు ఎదుర్కొంటున్నా’ అంటూ ఆ వీడియోలో తనుశ్రీదత్తా చెప్పింది. ఈ వీడియోపై సోషల్మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తున్నది. కేవలం వార్తల్లో నిలవడానికే ఆమె ఈ వీడియోను పోస్ట్ చేసిందని అత్యధికులు కామెంట్ చేశారు.