TVK President Vijay | తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళగ వెట్రీ కజగం (టీవీకే) పార్టీ కార్యవర్గ సమావేశం నేడు జరుగగా.. ఈ సమావేశంలో పార్టీ అధినేత, నటుడు దళపతి విజయ్ను 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నిర్ణయం అనంతరం విజయ్ మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అలాగే, డీఎంకేతో పాటు బీజేపీతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎటువంటి పొత్తులు పెట్టుకోబోమని ఆయన ప్రకటించారు. మరోవైపు, దళపతి విజయ్ సెప్టెంబర్ నుండి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ప్రకటన తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.