తమిళంలో ఘన విజయం సాధించిన ‘డీఎన్ఏ’ మూవీ తెలుగులో ‘మై బేబీ’ పేరుతో ఈ నెల 11న విడుదల కానుంది. ప్రేమిస్తే, జర్నీ, షాపింగ్‌మాల్, పిజ్జా వంటి విజయవంతమైన అనువాద చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత సురేశ్ కొండేటి ఈ ‘మై బేబీ’ని కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు.
అధర్వ మురళి, నిమిషా సజయన్ జంటగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌కి నెల్సన్ వెంకటేసన్ దర్శకుడు. 2014లో ఒక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో ఈ కథ సాగుతుందని, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో రూపొందిన భావోద్వేగపూరిత కథాంశమిదని మేకర్స్ చెబుతున్నారు. ఎస్.కె.పిక్చర్స్ ద్వారా ఈ సినిమా విడుదల కానుంది.