Siva Karthikeyan | కోలీవుడ్ నటుడు శివకార్తికేయన్ మూడోసారి తండ్రి కాబోతున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. శివకార్తికేయన్ తన దగ్గరి బంధువైన ఆర్తి దాస్ ను 2010లో పెళ్లిచేసుకున్నాడు. ఇప్పటికే ఈ దంపతులకు ఆరాధన, గుగన్ దాస్ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే చాలాకాలం తర్వాత ఈ జంట ముడో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఓ అభిమాని తన కొడుకు పుట్టినరోజు వేడుకకు శివకార్తికేయన్‌ను పిలువగా.. శివకార్తికేయన్ ఆయన భార్య ఆర్తి గెస్ట్లుగా వెళ్లారు. అయితే ఆ వీడియోలో ఆర్తికి కాస్త పొట్ట ఉన్నట్లుగా కనిపించింది. దీంతో నెటిజన్లు, అభిమానులు అది బేబీ బంప్ అయి ఉండొచ్చని కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. కాగా దీనిపై శివకార్తికేయన్ స్పందించాల్సి ఉంది.