Vijay Anand | సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు విజయ్ ఆనంద్ (71) కన్నుమూశారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. విజయ్ ఆనంద్ మృతితో సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది. పలు సినీ ప్రముఖులు ఆయన మృతికి నివాళులర్పించారు.
ప్రముఖ తమిళ దర్శకుడు విషు దర్శకత్వం వహించిన ‘నానగం వడ నానగం’ (1984) సినిమాతో సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు విజయ్ ఆనంద్. ఆ తర్వాత రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘నాన్ అడిమై ఇల్లై’ చిత్రం ఈయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తమిళంలో 10 చిత్రాలకు పైగా పని చేసిన విజయ్ ఆనంద్ కన్నడలో 100కు పైగా సినిమాలకు సంగీతం అందించాడు. ఇక విజయ్ఆనంద్ భౌతిక కాయానికి బుధవారం నాడు చైన్నెలో అంత్యక్రియలు జరిగాయి.