Pizza 3 The Mummy | కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు (Karthik Subbaraju) దర్శకత్వంలో 2012లో వచ్చిన ‘పిజ్జా’ (Pizza) ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్ సేతుపతి(Vijay Sethupathy), రమ్య నంబీసన్ (Ramya) ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక దీనికి కొనసాగింపుగా 2013లోఅశోక్ సెల్వన్ హీరోగా పిజ్జా 2 వచ్చింది. కాగా దాదాపు పదేళ్ల తర్వాత 2023లో ఈ ఫ్రాంచైజీ నుంచి పిజ్జా 3 ది మమ్మీ (Pizza 3 The Mummy) మూవీ వచ్చింది. అశ్విన్ కాకుమాను (Ashwin Kakumanu), పవిత్ర ప్రధాన పాత్రల్లో మోహన్ గోవింద్ తెరకెక్కించిన చిత్రం పిజ్జా 3 ది మమ్మీ (Pizza 3 The Mummy). ఈ సినిమా ఆగస్టు 18న తెలుగులో విడుదల కాగా.. వారం తిరగకుండానే ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video)లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇక పిజ్జా 3 తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది.
🔔 Tamil movie #Pizza3TheMummy (2023) now streaming on Prime Video.
Available in – Tamil (Original), Telugu Kannada & Malayalam. pic.twitter.com/fQwAlnGIvl
— Ott Updates (@Ott_updates) August 25, 2023