చెన్నై : తమిళ ఫిల్మ్ స్టార్ అజిత్ కుమార్(Ajit Kumar).. గ్యారేజీలోకి ఇప్పుడు కొత్త కారు వచ్చేసింది. స్పోర్ట్స్ బ్రాండ్ మెక్లారెన్ సెన్నా హైపర్ కారును కొన్నాడతను. లెజండరీ ఎఫ్1 డ్రైవర్ ఆర్టన్ సెన్నా పేరు మీదు ఈ కొత్త వేరియంట్ రిలీజ్ చేశారు. స్వయంగా రేస్ డ్రైవర్ అయిన అజిత్‌కు.. ఎఫ్1 డ్రైవర్ సెన్నాను ఆదర్శంగా తీసుకుంటాడు. మెక్లారెన్ కారుపై ఆర్టన్ సెన్నా ఆటోగ్రాఫ్ కూడా ఉంది. మెక్లారెన్ సెన్నా కారు డెలివరీకి చెందిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు అజిత్. ఆ ఇన్‌స్టా వీడియోను అభిమానులు తెగ్ లైక్ చేస్తున్నారు.
ట్రాక్‌పై దూసుకెళ్లేందుకు రెఢీగా ఉన్న ఆ సూపర్ కారును చూసి నటుడు అజిత్ స్టన్ అయ్యాడు. బటర్‌ఫ్లై డోర్స్‌తో ఆ కారు ఫుల్ అట్రాక్ట్చేస్తున్నది. ప్రతి కోణంలో కారును పరిశీలనగా చూసిన అజిత్.. ఆ తర్వాత డ్రైవ్ కోసం ఫ్రెండ్స్‌ను పిలిచాడు. మెక్లారెన్ కంపెనీ సెన్నా వర్షన్ కేవలం 500 కార్లను మాత్రమే తయారు చేసింది. ఇక సెన్నా జీటీఆర్ వర్షన్ కేవలం 75 కార్లు మాత్రమే ఉన్నాయి. సెన్నా ఎల్ఎం వర్షకు చెందిన 35 కార్లు మాత్రమే ప్రస్తుతం వాడకంలో ఉన్నాయి.
యాక్టర్ అజిత్‌కు కార్లు అంటే ఇష్టం. అతని వద్ద చాలా వరకు టాప్ బ్రాండ్లు ఉన్నాయి. ఫెరారీ ఎస్ఎఫ్90, పోర్షే 911, జీటీ3 ఆర్ఎస్, మెక్లారెన్ 750ఎస్ లాంటి మోడళ్లు అజిత్ వద్ద ఉన్నాయి.