Pa Ranjith – Janhvi Kapoor | తమిళ అగ్ర దర్శకుడిలలో పా.రంజిత్ ఒక్కడు. మద్రాస్, కబాలి, కాలా, సర్పాట్ట పరంబరై, తంగలాన్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని సంపాదించుకున్నాడు రంజిత్. అయితే ఈ దర్శకుడు ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్‌ను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌తో కలిసి పా.రంజిత్ ఒక వెబ్ సిరీస్ తెరకెక్కించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పనులు కూడా వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు ఈ వెబ్ సిరీస్‌ను పాపులర్ ఓటీటీ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.
బాలీవుడ్లో హిట్లు లేక సతమవుతున్న జాన్వీ ఈ మధ్య సౌత్ ఇండస్ట్రీపై ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్‌తో కలిసి దేవర సినిమా చేసిన ఈ అమ్మడు ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి ఆర్సీ 16 అనే చిత్రంలో నటిస్తుంది. ఇవే కాకుండా జాన్వీ ఫ్యూచర్లో కూడా సౌత్ సినిమాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.