తమిళ స్టార్ హీరో సూర్య తెలంగాణకు చెందిన తన అభిమాని తాటికొండ ఐశ్వర్య హఠాన్మరణం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల అమెరికా టెక్సాస్‌లో ఓ మాల్లో ఆగంతకులు జరిపిన కాల్పుల్లో ఐశ్వర్య మృతి చెందింది. ఆమె స్వస్థలం సూర్యపేటలోని పాత నేరేడుచర్ల. ఐశ్వర్య మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ ఆమె తల్లిదండ్రులు అరుణ, నర్సిరెడ్డిలకు లేఖను పంపించారు సూర్య. ఆ లేఖలో ఆయన స్పందిస్తూ…‘ఐశ్వర్య పుట్టినరోజున స్వయంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుదామని అనుకున్నా. బెస్ట్ విషెస్ కోసం పంపాల్సిన ఈ లేఖ సంతాప సందేశం కావడం బాధాకరం. నీ అభిమానం పొందడం అదృష్టంగా భావిస్తున్నా’ అని అన్నారు.