Sarath Kumar | నటుడు శరత్‌కుమార్‌కు తీవ్ర అస్వస్థత.. అందోళనలో తమిళ చిత్ర పరిశ్రమ..!
ప్రముఖ సీనియర్ నటుడు శరత్‌కుమార్ తీవ్ర అస్వస్థకు గురైయ్యాడు. డయేరియాతో డిప్రెషన్‌కు గురైన ఆయన ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన భార్య రాధిక, కూతురు వరలక్షి శరత్‌కుమార్ హస్పటల్‌కు చేరుకున్నట్లు తెలుస్తుంది.
Sarath Kumar Was Hospitalized | ప్రముఖ సీనియర్ నటుడు శరత్‌కుమార్ తీవ్ర అస్వస్థకు గురైయ్యాడు. డయేరియాతో డిప్రెషన్‌కు గురైన ఆయన ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన భార్య రాధిక, కూతురు వరలక్షి శరత్‌కుమార్ హస్పటల్‌కు చేరుకున్నట్లు తెలుస్తుంది. అయితే.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు నుంచి ఎలాంటి స్పందన లేదు. అలాగే ఆసుపత్రి వర్గాలు కూడా ఎలాంటి మెడికల్ బులిటెన్‌ను విడుదల చేయలేదు. ఈ విషయం తెలిసి తమిళ సినీ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. ఆయన త్వరగా కోలుకొని ఇంటికి తిరిగి రావాలని సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు.
శరత్‌కుమార్ సినీ ప్రస్థానం టాలీవుడ్లోనే మొదలయింది. 1986లో ‘సమాజంలో స్త్రీ’ అనే సినిమాతో ఆయన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తరువాత రెండేళ్లకు కన్ సిముట్టుమ్ నేరమ్ సినిమాతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ కూడా శరత్‌కుమారే. ఈ సినిమా శరత్‌కుమార్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్టుగా తెగ బిజీ అయ్యాడు. ఏడాదికి పది సినిమాలు చేస్తూ తీరిక లేకుండా షూటింగ్‌లు చేసేవాడు. ఈ క్రమంలోనే హీరోగా మారి పలు సినిమా చేశాడు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, సింగర్‌గా పలు విభాగాల్లో పనిచేసి కోలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు ఈయన 130 సినిమాల్లో పైగా నటించాడు. నిర్మాతగా పదకొండు సినిమాలను తెరకెక్కించాడు. ‘తలైమగన్’ సినిమాకు మెగాఫోన్ పట్టి సక్సెస్ సాధించాడు. తెలుగులో ఆయన జయ జానకి నాయక, భరత్ అనే నేను, నా పేరు సూర్య, సాక్ష్యం వంటి సినిమాల్లో నటించాడు. శరత్‌కుమార్ కీలకపాత్రలో నటిస్తున్న వారసుడు రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

