Radha Ravi – Aswini Dutt | ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు వైజయంతి మూవీస్ నిర్మాత చలసాని అశ్వనీదత్. ఆయన నిర్మాణంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
అయితే అశ్వనీదత్‌పై తమిళ సీనియర్ నటుడు రాధ రవి (Radha Ravi) సంచలన ఆరోపణలు చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా కులం చూసి తనను సినిమాలో రిజెక్ట్ చేశాడని రాధ రవి అన్నాడు. వెంకటేశ్, కుష్బూ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం కలియుగ పాండవులు (1986) ఈ సినిమా టైంలో నేను వైజాగ్‌లో ఉండగా.. నన్ను తన సినిమాల్లో నటించమని బుక్ చేసుకోవడానికి అశ్వనీదత్ వచ్చాడు. నేను అప్పుడు అశ్వనీదత్‌కు ఒక్కటే చెప్పాను. నాకు తెలుగులో కే.రాఘవేంద్ర రావు (K.Raghavendra Rao) మాత్రమే తెలుసు అతను ఏం చెబితే అదే ఫైనల్ అన్నాను.
అయితే నన్ను బుక్ చేయమని అశ్వనీదత్ తన అసిస్టెంట్‌కు చెప్పాడు. అది చెబుతూ.. మీ కాస్ట్ ఏంటి అని అడిగాడు. నేను నాకు సరిగ్గా తెలియదు బలిజ నాయుడు కావచ్చు అన్నాను. దీంతో అది విన్న అశ్వనీదత్ సైలెంట్‌గా వెళ్లిపోతూ తన బ్యానర్లో ఉన్న నా సినిమాలు అన్ని క్యాన్సిల్ చేయమన్నాడు. దీనికి కారణం అడుగగా చెప్పకుండా వెళ్లాడు. దీనిపై రాఘవేంద్ర రావు స్పందిస్తూ.. అతడికి ఏం అయ్యింది ఎందుకు క్యాన్సిల్ చేశాడు అని అన్నాడు నాకు తెలియదు సర్ అన్నాను అంటూ రాధ రవి వెల్లడించాడు.
తన వైజయంతి మూవీస్ లో నన్ను బుక్ చేసుకుందాం అని వచ్చి…. నా Caste బలిజ నాయుడు అని తెలిసి బుక్ చేయకుండ వెళ్ళిపోయాడు అశ్వినిదత్ – Actor Radha Ravi (రాధిక బ్రదర్)
వీడి K పిచ్చి 🙏🙏 pic.twitter.com/KzqQ4q06Iv
— Nag1406 (@king_nag_1406) July 19, 2024
Also read..