తెలుగులో ధనుష్ మరో సినిమా చేయబోతున్నాడా?
తమిళనాట స్టార్ హీరో స్టేటస్ అందుకుంటూనే.. బాలీవుడ్‌లోనూ అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు ధనుష్. హాలీవుడ్‌లోనూ ఒక ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. తెలుగులో డైరెక్ట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

వైవిధ్యభరిత సినిమాల్లో నటిస్తూ తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనుష్. ఇప్పుడు ఈయన కన్ను టాలీవుడ్పైన పడింది. తమిళనాట స్టార్ హీరో స్టేటస్ అందుకుంటూనే.. బాలీవుడ్‌లోనూ అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు ధనుష్. హాలీవుడ్‌లోనూ ఒక ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. తెలుగులో డైరెక్ట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈయన తెలుగులో సినిమా చేయబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఇప్పుడు తెలుగులో ధనుష్ మరో సినిమాకు ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నిన్న (జూలై 28)న ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, సెలబ్రెటీలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే సితార ఎంటర్టైన్మెంట్ కూడా శుభాకాంక్షలు చెప్పింది. ఈ క్రమంలోనే తెలుగులో ధనుష్ మరో సినిమా కన్ఫార్మ్ అయినట్లు వార్తలు మొదలయ్యాయి. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. మునుపెన్నడూ చూడని విధంగా ధనుష్ ఇందులో కనిపించనున్నాడట.
ప్రస్తుతం ధనుష్ గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. బాలీవుడ్లో అక్షయ్ కుమార్, సారా అలీఖాన్‌తో కలిసి అతరంగి రే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. అలాగే ది గ్రే మ్యాన్ అనే హాలీవుడ్ సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే కార్తిక్ నరేన్ దర్శకత్వంలో మారన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో డైరెక్ట్ తెలుగు సినిమాకు కూడా ఓకే చెప్పాడు ధనుష్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సిల్క్ స్మితను కొట్టే ఆడది లేదు.. శ్రీదేవి కూడా ఆమెనే ఫాలో అయ్యేది.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు
రెండో పెళ్లికి సిద్ధమైన అక్కినేని మనుమడు.. నెట్టింట పెళ్లి కార్డు వైరల్
చిరంజీవి బ్లాక్ బస్టర్ రీమేక్‌లో పవన్ కళ్యాణ్
పవన్-రానా రీమేక్ ప్రాజెక్టు మేకింగ్ వీడియో
RRR ప్రమోషన్స్ | ఐదు భాషల్లో దోస్తీ సాంగ్.. ఒక్కో భాషలో ఒక్కో సింగర్
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
బుచ్చిబాబు మళ్లీ ఆ హీరోనే కావాలంటున్నాడా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

