TN Polling 2026 | తమిళనాడు వ్యాప్తంగా 234 నియోజకవర్గాలకు సంబంధించి 2026 శాసనసభ ఎన్నికల పోలింగ్ నేడు అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. అయితే ఈ ప్రజాస్వామ్య పండుగలో కోలీవుడ్ అగ్ర హీరో అజిత్ కుమార్ తన పౌర బాధ్యతను చాటుకోవడంలో అందరికంటే ముందు నిలిచి వార్తల్లో నిలిచారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ అధికారికంగా ప్రారంభం కావాల్సి ఉండగా, అజిత్ అంతకంటే ముందే అంటే 6:40 గంటలకే చెన్నైలోని తిరువాన్మియూర్ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఎటువంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సాధారణ పౌరుడిలా తెల్లటి దుస్తుల్లో వచ్చి క్యూ లైన్లో నిలబడి ఓటు వేసిన తొలి సెలబ్రిటీగా ఆయన నిలిచారు. ముఖ్యంగా బెల్జియంలో జరుగుతున్న కార్ రేసింగ్ ఈవెంట్లో బిజీగా ఉన్నప్పటికీ, కేవలం తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసమే నిన్న రాత్రికి రాత్రే ఆయన చెన్నై చేరుకోవడం విశేషం. మే 4న వెలువడనున్న ఫలితాల కోసం రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో, DMK, AIADMK-BJP కూటములతో పాటు విజయ్ నేతృత్వంలోని TVK మధ్య త్రిముఖ పోరు నెలకున్న ఈ ఎన్నికల్లో అజిత్‌తో పాటు రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ వంటి ప్రముఖులు కూడా ఉదయాన్నే తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Thala #Ajithkumar is the First Person to Cast his vote in Tamilnadu..😮🔥
— Laxmi Kanth (@iammoviebuff007) April 23, 2026