Bigg Boss 9 | తమిళ్ బిగ్ బాస్ సీజన్ 9లో జరిగిన ఒక ఘటన ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పటికే మంచి రేటింగ్స్‌తో దూసుకుపోతున్న ఈ సీజన్లో గొడవలు, చర్చలు కామన్‌గా మారాయి. అయితే తాజాగా టాస్క్ సమయంలో చోటుచేసుకున్న యాక్సిడెంట్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్ అయింది. టాప్ కంటెస్టెంట్‌గా కొనసాగుతున్న వీజే పార్వతి, ఒక ఫిజికల్ టాస్క్‌లో పాల్గొంటూ ప్రమాదానికి గురైంది. శబరినాథ్ అనే కంటెస్టెంట్‌తో పోటీ పడుతున్న సమయంలో అతని మోకాలి భాగం అనుకోకుండా పార్వతి కంటిపై బలంగా తగలడంతో ఆమె అక్కడికక్కడే నేలపై పడిపోయింది. తీవ్ర నొప్పితో ఏడుస్తూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తక్షణమే పార్వతిని మెడికల్ రూమ్‌కు తీసుకెళ్లి చికిత్స అందించగా, ఆరోగ్యపరంగా పెద్ద సమస్య ఏమీ లేదని బిగ్ బాస్ నిర్వాహకులు స్పష్టం చేశారు. అయితే కన్నుమొత్తం వాచిపోయిన పరిస్థితిలో కూడా పార్వతి మళ్లీ టాస్క్ కొనసాగించడానికి సిద్ధమైన తీరు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఈ ఘటనపై నెట్టిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిజికల్ టాస్క్‌లు హద్దులు దాటుతున్నాయని, ఇలాంటి ప్రమాదాలు ఎదురవ్వకుండా బిగ్ బాస్ నిర్వాహకులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గతంలోనూ నటి వనితా విజయ్ కుమార్‌పై హౌస్ బయట దాడి జరిగిన ఘటనను గుర్తుచేస్తూ, కంటెస్టెంట్ల భద్రతే మొదటి ప్రాధాన్యం కావాలని ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు.
టాస్క్‌లు కఠినతరం కావడంతో, హౌస్‌లో ఒత్తిడి పెరగడంతో కంటెస్టెంట్స్ పూర్తి శక్తితో పోటీ పడుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు ఎక్కువవుతున్నాయని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగులోను బిగ్ బాస్ కార్యక్రమం చాలా రసవత్తరంగా సాగుతుంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా సక్సెస్ ఫుల్‌గా సాగుతున్న ఈ షోలో కూడా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఈ సారి సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్ ఫుల్ కామెడీ పంచుతూ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్నారు.