Tamannah- Vijay| ఇటీవల సెలబ్రిటీల బ్రేకప్‌లు పరిపాటిగా మారాయి. లవ్, బ్రేకప్‌కి మధ్య పెద్ద గ్యాప్ ఉండడం లేదు. గత కొద్ది రోజులుగా తమన్నా, విజయ్ బ్రేకప్లకి సంబంధించి నెట్టింట అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఒకవైపు ఈ వీరి బ్రేకప్ ప్రచారం జోరుగా సాగుతున్నా మరో పక్క తమన్నా కాని విజయ్ కాని దీనిపై ఏ మాత్రం స్పందించడం లేదు. ఇద్దరు సైలెంట్‌గా ఉన్నారు. దీంతో వీరి బ్రేకప్ రూమర్స్ మరింత ఎక్కువ అవుతున్నాయి. అంతేకాదు వారు విడిపోవడానికి గల కారణాలు ఇవేనంటూ పలువురు ముచ్చటించుకుంటున్నారు.
తాజాగా తమన్నా, విజయ్ విడిపోవడానికి కారణం ఇదేనంటూ ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. తమన్నా త్వరగా సెటిల్ అవ్వాలని అనుకోగా, పెళ్లి చేసుకోవాలని విజయ్ తొందరపెట్టడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని అంటున్నారు. దీనిపై ఇంకా క్లారిటీ లేదు . ప్రస్తుతం ఓదెలా 2తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతోంది తమన్నా అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఎవరైనా క్రియేట్ చేశారా? అనే అనుమానం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్‌తో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి గత రెండేళ్ల నుండి డేటింగ్ చేస్తున్నారు.
త్వరలోనే ఇద్దరు పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఇలా తమన్నా, విజయ్ బ్రేకప్ చెప్పుకున్నారని తెలిసి అందరు షాక్ అవుతున్నారు. తమన్నా గురించి మనందరికి పూర్తిగా తెలుసు. అయితే విజయ్ వర్మ బాలీవుడ్ నటుడిగానే కొందరికి తెలుసు. ఆయన పక్కా హైదరాబాదీ. 1986 మార్చి 29న హైదరాబాద్‌లోని మార్వాడీ కుటుంబంలో జన్మించిన విజయ్ చదువుంతా హైదరాబాద్‌లోనే సాగింది. ఆయన తండ్రి వ్యాపారవేత్త కాగా.. విజయ్ 2005లో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి నటనలో శిక్షణ తీసుకొని ఆ తర్వాత సినిమాలలో నటించారు. చిట్టగాంగ్, రంగేజ్, గ్యాంగ్ ఆఫ్ గోస్ట్స్, పింక్ వంటి హిందీ చిత్రాల్లో నటించారు. తెలుగు నాని హీరోగా వచ్చిన ఎంసీఏ సినిమాలో విలన్‌గా కనిపించి తెలుగు ప్రేక్షకులని కూడా అలరించారు.