దక్షిణాది సినిమాలో పురుషాధీక్యత గురించి ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడింది మిల్కీబ్యూటీ తమన్నా. ‘ పురుషాధీక్యత అనేది ఎక్కడైనా ఉన్నదే. సినిమాల్లో అది కాస్త ఎక్కువ. దక్షిణాది సినిమాల్లో ఇంకాస్త ఎక్కువ. ఒక స్త్రీగా ఇది నాకు ఇబ్బందిని కలిగించే అంశమే. దక్షిణాది సినిమా నన్ను నటిగా నిలబెట్టింది. అందుకే సర్దుకుపోక తప్పలేదు. నిజానికి సినిమా అంతా హీరో చుట్టూనే తిరగడం కరెక్ట్ కాదు.
కథ అన్నాక హీరోకి ఎంత ప్రాధాన్యత ఉందో హీరోయిన్‌కి కూడా అంతే ప్రాధాన్యత ఉండాలి. అప్పుడు సినిమా నిండుగా ఉంటుంది. ప్రస్తుత సినిమాల్లో ఎలివేషన్స్ ట్రెండ్ నడుస్తున్నది. కథతో సంబంధం ఉండదు. బిల్డప్లే ఎక్కువ. నిజానికి ఇలాంటి సినిమాల్లో నటించడం నాకు ఇష్టం ఉండదు. కానీ తప్పట్లేదు. మరీ నా ఆస్తిత్వానికి ఇబ్బంది అనిపిస్తే మాత్రం దర్శకుడితో చెప్పేస్తాను. అలా తప్పుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల్లో చేయడంలో ఉన్న కిక్కు, హీరో ఓరియెంటెడ్ సినిమాల్లో ఉండదు’ అంటూ మనసును ఆవిష్కరించారు తమన్నా.