టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah), పాపులర్ రాపర్ బాద్షా (Badshah)తో కలిసి టబహి మ్యూజిక్ వీడియో (Tabahi music video)చేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ విడుదలైన కొన్ని గంటల్లోనే 6 లక్షలకుపైగా వ్యూస్‌తో నాన్‌స్టాప్‌గా దూసుకెళ్తోంది. తమన్నా స్టైలిష్ అండ్ ట్రెండీ లుక్‌లో అందాలు ఆరబోస్తూ మ్యూజిక్ లవర్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. ఈ పాట గురించి తమన్నా మాట్లాడుతూ..మొదటి సారి నేను బాద్ షాతో కలిసి పనిచేస్తున్నా. బాద్ షాతో బ్లాస్టింగ్ మేకింగ్ వీడియో చేశాం.
ఈ పాటను తొలిసారి విన్నప్పటి నుంచి రహస్యంగా పాడటం ప్రయత్నించా. ఇపుడు ఈ పాటను చాలా బిగ్గరగా పాడుతున్నా. ఈ పాటలో నాకు నచ్చిన సీన్ హుక్ స్టెప్. పాట చేస్తున్న ప్రతీ క్షణంలో హుక్ స్టెప్ నాలో జోష్ నింపింది. టబహి మ్యూజిక్ వీడియో ఇప్పటికే దేశమంతటా విపరీతమైన ప్రేమను, పాపులారిటీని పొందుతోంది. పాటను ఆదరిస్తున్న వారందరికీ కృతజ్ఞురాలిని అన్నది తమన్నా.
తమన్నా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టింది. సత్యదేవ్‌తో కలిసి గుర్తుందా సీతాకాలం సినిమాలో నటిస్తోంది. దీంతోపాటు వెంకటేశ్, వరుణ్ తేజ్ కాంబోలో వస్తున్న ఎఫ్ 3, భోళా శంకర్‌తోపాటు హిందీలో ప్లాన్ ఏ ప్లాన్ బీ, యార్ దోస్త్, బబ్లీ బౌన్సర్ చిత్రాల్లో నటిస్తోంది.