Bhola Shankar Movie | మూడు వారాలకు పైగా విడుదలకు టైమ్ ఉన్న భోళా శంకర్ చక చక పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటుంది. ఓ వైపు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ఇస్తూనే.. మరోవైపు డబ్బింగ్ సహా పలు ప్యాచ్ వర్కులను కంప్లీట్ చేసుకుంటుంది. ఇప్పటికే రిలీజైన టీజర్ అభిమానులకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. వింటేజ్ బాస్‌ను చూడబోతున్నామనే ఫీల్‌తో ఉన్నారు. ఓ వైపు మెహర్ రమేష్ టేకింగ్‌పై బోలెడు అనుమానాలున్నా.. చిరుతో సినిమా, పైగా ఆయన అభిమాని కాబట్టి సినిమా అందరినీ సాటిస్ఫై చేసే రేంజ్‌లోనే ఉంటుందని ధీమాగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా మిల్కి బ్యూటీ సినిమాకు డబ్బింగ్ పూర్తి చేసుకున్నట్లు మెహర్ రమేష్ వెల్లడించాడు.
మిల్కీ బ్యూటీ తమన్నా భోళా శంకర్ సినిమాకు డబ్బింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుందని, ఈ సినిమాలో చిరుకు, తమన్నాకు మధ్య సన్నివేశాలు చాలా వినోదాత్మకంగా ఉంటాయని వెల్లడించాడు. ఈ మేరకు డబ్బింగ్ స్టూడీయోలో తమన్నాతో కలిసి దిగిన ఫోటోను పంచుకున్నాడు. ఇక ఇటీవలే మెగాస్టార్ చిరు, కీర్తి సురేష్ డబ్బింగ్ పార్ట్‌ను కంప్లీట్ చేసుకున్నారు. ఇక రీసెంట్గా రిలీజైన మిల్కీ బ్యూటీ సాంగ్ వీళ్ల జోడీ బాగా సెట్ అయిందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేశారు.
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో బంపర్ హిట్టయిన వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కుతుంది. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరుకు చెల్లెలిగా కనిపించనుంది. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటించింది. ఏకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర ఈ సినిమాను నిర్మించాడు. సుశాంత్ కీలకపాత్రలో కనిపించనున్నాడు.
Our #MilkyBeauty @tamannaahspeaks Dubbing finished for @BholaaShankar 🔱
Entertaining & Glamorous role 🤩 her scenes with
#MegaStar @KChiruTweets 🌟 @KeerthyOfficial @iamSushanthA will bring good fun along with #hyperaadhi @harshachemudu #brahmanandam garu @AKentsOfficial… pic.twitter.com/QMLBo8xy8x— Meher Ramesh 🇮🇳 (@MeherRamesh) July 22, 2023
;