Tamannah- Vijay| ఈ మధ్య సెలబ్రిటీల బ్రేకప్ వార్తలు మనం ఎక్కువగా వింటున్నాం.ఈ క్రమంలోనే తమన్నా- విజయ్ వర్మల బ్రేకప్‌కి సంబంధించి సోషల్ మీడియాలో అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోయిందంటే అభిమానులు, సినీ ప్రముఖులు కూడా నమ్మలేకపోయారు. త్వరలో పెళ్లి చేసుకుంటారు అనుకుంటున్న సమయంలో ఈ బ్రేకప్ వార్తలేంటి అని ముక్కున వేలేసుకున్నారు. అయితే ఇదే సమయంలో ఈ జంట హోళి వేడుకల్లో మెరవడం చర్చనీయాంశం అయింది. బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ ఏర్పాటు చేసిన హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ పాల్గొన్నారు.
కాని ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ప్రేమలో ఉన్న వారెవరైన జంటగా కలిసి వెళతారు, కాని తాజాగా హోళీ వేడుకల్లో వేర్వేరుగా పాల్గొన్నారు. వీరిద్దరూ విడివిడిగా రవీనా ఇంటికి వచ్చారు. ఫొటోగ్రాఫర్లను పలకరించి, హోలీ శుభాకాంక్షలు తెలిపారు. బ్రేకప్ వార్తల వేళ వీరిద్దరూ ఒకే కార్యక్రమంలో పాల్గొనడం ఆసక్తిగా మారిన ఇద్దరు విడివిడిగా కార్యక్రమంలో పాల్గొనడం లేని పోని అనుమానాలు కలిగిస్తుంది. ఈ ఇద్దరు రిలేషన్ షిప్లో ఉన్నారా, లేకుంటే బ్రేకప్ చెప్పుకున్నారా అనే దానిపై క్లారిటీ రావలసి ఉంది. 2023లో వచ్చిన లస్ట్ స్టోరీస్ -2 షూటింగ్ సమయంలో విజయ్‌తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది.
షూటింగ్లో ఎప్పుడు తన సినిమాలు, వ్యాపారాల గురించే పట్టించుకునే తమన్నా అలా ప్రేమించడం అందరికి షాక్ ఇచ్చింది. ఒకప్పుడు చాలా పద్దతిగా కనిపించిన తమన్నా ఇప్పుడు హాట్ హాట్ సన్నివేశాలలో కనిపిస్తూ కాక రేపుతుంది. ఐటెం సాంగ్స్‌లో చిందులేస్తుంది. గ్లామర్ షో వరకు ఓకే కానీ కెరీర్లో ఎప్పుడూ లిప్ లాక్ సీన్స్‌లో తమన్నా నటించలేదు.కాని విజయ్ తో లిప్ లాక్ సీన్ చేసి అందరు నోరెళ్లపెట్టేలా చేసింది. కాగా, ఈ ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాలో ఉన్న ఒకరి ఫోటోలను మరొకరు డిలీట్ చేయడంతో ఈ స్టార్ కపుల్ బ్రేకప్ నిజమేనని అంతా క్లారిటీకి వచ్చేశారు. ఏది ఏమైన తమన్నా – విజయ్‌ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.