అందం, నటన, డ్యాన్స్‌తో అభిమానులను అలరిస్తున్నది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. నటనకు ఆస్కారం ఉన్న క్యారెక్టర్లతోపాటు గ్లామర్ రోల్స్‌తోనూ మెప్పిస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా ముద్దు సీన్లతోపాటు శృంగార సన్నివేశాల్లో నటించకూడదనే రూల్‌ను పక్కన పెట్టేసింది. ‘లస్ట్ స్టోరీస్-2’లో తమన్నా నటించిన సన్నివేశాలు అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ‘లస్ట్ స్టోరీస్-2’ సిరీస్‌లో శృంగార సన్నివేశాల్లో నటించడంపై ఒక ఇంటర్వ్యూలో బోల్డ్ కామెంట్స్ చేసిందీ భామ.
‘లస్ట్ స్టోరీస్ మొదటి భాగం చూసిన తర్వాత శృంగార సన్నివేశాలపై నా అభిప్రాయమే మారిపోయింది. బోల్డ్‌గా కనిపిస్తే తప్పేంటి అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. అందుకే ‘లస్ట్ స్టోరీస్-2’లో నటించాను. అభిమానులు ఇలాంటి సిరీస్‌లు, సీన్లు చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రజలు నన్ను ఎలా చూడాలని అనుకుంటున్నారో అలాగే స్క్రీన్‌పై కనిపించాలి. నటిగా అది నాకు అవసరం. బోల్డ్ సీన్స్‌లో నటించేటప్పుడు టెన్షన్ పడలేదు. ఆ క్రెడిట్ విజయ్ వర్మకు దక్కుతుంది. తను నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు’ అని చెప్పుకొచ్చింది తమన్నా.