ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లపై డేటింగ్ వార్తలు రావడం సాధారణమే. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సహా భాషతో సంబంధం లేకుండా ఇతర ఇండస్ట్రీల్లో కూడా ఏదో ఒక డేటింగ్ న్యూస్ తెరపైకి వస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి డేటింగ్ పుకార్లతో వార్తల్లో నిలిచింది టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia). సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ ముంబై భామ ఆ మధ్య హైదరాబాదీ నటుడు విజయ్ వర్మ(Vijay Varma)తో సన్నిహితంగా కనిపించిన స్టిల్స్ నెట్టింట్లో హల్ చల్ కూడా చేశాయి. ఈ ఇద్దరూ సహజీవనం చేస్తున్నారంటూ నెటిజన్లు తెగ చర్చించుకోవడం మొదలుపెట్టారు.
డేటింగ్ వార్తలు రావడంపై స్పందిస్తూ.. ‘అలా ఎందుకు జరుగుతుందో తనకు తెలియదు కానీ.. ఆడవాళ్లకు (సినిమా హీరోయిన్లనుద్దేశించి) నిజంగా పెళ్లి చేసుకునే కంటే ముందే చాలా సార్లు పెళ్లవుతుంది. మేం ప్రతీ శుక్రవారం (సినిమా విడుదలయ్యే రోజు) పెళ్లి చేసుకుంటాం. ఆ తర్వాత ఇంకా పెళ్లి కాలేదని తెలిశాక.. జనాలు ప్రతీ సారి చాలా మంది వ్యక్తులతో నాకు పెళ్లి చేస్తున్నారు. పుకార్ల ప్రకారం నేను డాక్టర్ నుండి వ్యాపారవేత్త వరకు.. ఇలా చాలా మందిని పెళ్లి చేసుకున్నానని భావిస్తున్నా’.
‘నేను నిజంగా పెళ్లి చేసుకున్నపుడు ఏం జరుగుతుందో నాకు తెలియదు. అప్పుడు కూడా జనాలు మళ్లీ ఎక్జయిట్ అవుతారా..? లేదంటే అది కూడా మరో పుకారు మాత్రమే అనుకుంటారా? అనేది చూడాలని’ చెప్పుకొచ్చింది. మొత్తానికి తాను విజయ్ వర్మతో డేటింగ్ ఉన్నట్టా..? లేనట్టా..? అనే దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే చిట్ చాట్ ముగించేసింది తమన్నా.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న భోళా శంకర్లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది తమన్నా. రజినీకాంత్ నటిస్తోన్న జైలర్తోపాటు హిందీలో భోలే చుడియాన్, తమిళం, మలయాళంలో ఒక్కో సినిమాలో నటిస్తోంది.