Tamannaah Bhatia | ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంది. సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి చేరుకున్న ఆమె, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా తన తిరుమల పర్యటనకు సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే, తమన్నా తదుపరి చిత్రం ‘వ్వాన్’ (Vvan)లో నటించబోతున్నారు. ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో కనిపిస్తుండగా, దీపక్ మిశ్రా మరియు అరుణాభ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం రక్షా బంధన్ కానుకగా ఈ ఏడాది ఆగస్టు 28న థియేటర్లలో విడుదల కానుంది.

Tamannaah