అగ్ర కథానాయిక తమన్నా డిజిటల్ మీడియాను బాగానే ఉపయోగించుకుంటున్నది. ఇప్పటికే తెలుగులో ‘11 అవర్’, తమిళంలో ‘నవంబర్ స్టోరి’ అనే వెబ్ సిరీస్‌ల్లో నటించింది. ఈ రెండు వెబ్ సిరీస్‌లు విజయం సాధించడంతో తమన్నాకు ఓటీటీ వేదికల్లో క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఆమె హిందీలో చేసిన కొత్త వెబ్ సిరీస్ ‘జీ కర్దా’…ఈ నెల 15న ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్నది. టీనేజ్ ఫ్రెండ్స్ మధ్య జరిగే కథతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్ గురించి తమన్నా మాట్లాడుతూ…‘కొంతమంది స్నేహితుల మధ్య జరిగే కథ ఇది. జీవితాన్ని తక్కువగా అంచనా వేసిన వారికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అనేది ఆసక్తికరంగా ఉంటుంది. 30 ఏండ్లకే జీవితంలో స్థిరపడతామని ఊహించుకున్న వారికి అది అంత సులువుగా జరగదని అర్థమవుతుంది. యువత జీవితంలోని స్నేహాలు, అనుబంధాలు, బాధలు వంటివి సహజంగా ఉంటూ మనం పోల్చుకునేలా ఉంటాయి’ అని చెప్పింది.