Tamannaah Bhatia | ఇటీవలే ‘ఓదెల 2’తో ప్రేక్షకులను అలరించిన మిల్కీ బ్యూటీ తమన్నా ఈసారి వెబ్ సిరీస్‌తో అలరించడానికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. నటి తమన్నా (Tamannaah Bhatia) బాలీవుడ్ నటి డయానా పెంటీ (Diana Penty) ప్రధాన పాత్రల్లో వస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘డు యూ వనా పార్ట్నర్’ (Do You Wanna Partner). కాలిన్, అర్చిత్‌కుమార్ ఈ వెబ్ సిరీస్‌కు సంయుక్తంగా దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video) ఒరిజినల్ సిరీస్‌గా ఈ చిత్రం రుపోందుతుంది. ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కాబోతుండగా.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. కార్పోరెట్ జాబ్‌లతో విసిగిపోయిన ఇద్దరు స్నేహితులు స్వయంగా బీర్ తయారు చేసి కంపెనీ పెడదం అనుకుంటారు. ఈ క్రమంలో వారికి ఎదురైన అనుభవాలు ఏంటి అనేది ఈ వెబ్ సిరీస్ స్టోరీ అని తెలుస్తుంది. కామెడీ అండ్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ రాబోతుంది.