Tamannaah Bhatia | ఇటీవలే ‘ఓదెల 2’తో ప్రేక్షకులను అలరించిన మిల్కీ బ్యూటీ తమన్నా ఈసారి వెబ్ సిరీస్‌తో అలరించడానికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. నటి తమన్నా (Tamannaah Bhatia) బాలీవుడ్ నటి డయానా పెంటీ (Diana Penty) ప్రధాన పాత్రల్లో వస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘డు యూ వనా పార్ట్నర్’ (Do You Wanna Partner). కాలిన్, అర్చిత్‌కుమార్ ఈ వెబ్ సిరీస్‌కు సంయుక్తంగా దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video) ఒరిజినల్ సిరీస్‌గా ఈ చిత్రం రుపోందుతుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని చిత్రబృందం ప్రకటించింది. ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఇద్దరు యువతుల స్నేహం, వారు ఎదుర్కొన్న సవాళ్లు తదితర అంశాలను ఈ సిరీస్‌లో చూపించనున్నారు.
raising a toast because they’re here with something brew-tiful 🍺#DoYouWannaPartnerOnPrime, New Series, September 12 pic.twitter.com/NM9tLCKPRG
— prime video IN (@PrimeVideoIN) August 25, 2025