Tamanna-Vijay Varma | గతకొన్ని రోజులుగా టాలీవుడ్ హీరోయిన్ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. న్యూ ఇయర్ పార్టీలో వీరిద్దరూ ముద్దుపెట్టుకున్న వీడియో ఓ సంచలనమే రేపింది. అయితే అది నిజమా? కాదా? వీడియోలో ఉన్నది వాళ్లేనా అనే దానిపై వీరిద్దరూ స్పందించలేదు. దాంతో వీళ్ల రిలేషన్‌పై వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. అంతేకాకుండా వీరిద్దరూ పలు పార్టీలకు కలిసి వెళ్లినట్లు చాలా సార్లు మీడియా కంట కూడా పడ్డారు. ఇదే విషయాన్ని ఎన్ని సార్లు అడిగినా వీరిద్ధరూ స్పందించలేదు. కాగా తాజాగా ఈ జంట మరోసారి మీడియా కంట పడింది.
తాజాగా ముంబైలో వీరిద్దరూ ఓ రెస్టారెంట్లో డిన్నర్ చేసినట్లు తెలుస్తుంది. ఇక డిన్నర్ తర్వాత వీరిద్దరూ ఒకే కారులో వెళ్లారు. తమన్నా కారు ఎక్కుతున్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీస్తుంటే హాయ్ చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దాంతో పలువురు నెటిజన్లు వీరిద్ధరూ రిలేషన్లో ఉన్నట్లు బహిరంగంగానే చెబుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం తమన్నా చేతిలో అరడజను సినిమాలున్నాయి. అందులో చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ కూడా ఒకటి. ఇక తమన్నా, విజయ్ వర్మలు కలిసి ‘లస్ట్ స్టోరీస్-2’లో నటించారు. ఇక అప్పటి నుంచి వీళ్ళు డేటింగ్లో ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి.