Ayushmann Khurrana | బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి స్టార్ హీరోగా ఎదిగారు. ఆయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు కూడా సాధించాయి. అయితే ఆయుష్మాన్ ఖురానా సతీమణి, నటి, దర్శకురాలు తహీరా కశ్యప్ రెండోసారి క్యాన్సర్ బారిన పడడం అందరు షాక్ అయ్యేలా చేసింది.తహీరా కశ్యప్ గతంలో క్యాన్సర్ నుంచి కోలుకున్నారు. అయితే, తిరిగిన తనకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని తహీరా కశ్యప్ చెప్పుకొచ్చింది. రెండోసారి క్యాన్సర్‌పై తాను యుద్ధం చేయబోతున్నట్టు పేర్కొంది.
ఎటువంటి అవాంతరాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్టు తహీరా తన పోస్ట్‌లో తెలియజేసింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తహీరా తన రొమ్ము క్యాన్సర్ విషయం గురించి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరింది. దీనికి ఆయుష్మాన్ స్పందిస్తూ మై హీరో అని కామెంట్ పెట్టారు. అలానే ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా ఆమె త్వరగా కోలుకోవాలని తెలియజేస్తూ ధైర్యంగా ఉండమని కోరుతున్నారు. 2018 లో తహీరాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్లు నిర్దారణ కాగా, అప్పటినుంచి చికిత్సలో భాగంగా జరిగే ప్రతి చర్యనీ ఆమె సోషల్ మీడియాలో పంచుకుంటూ వస్తుంది.
అయితే బ్రెస్ట్ క్యాన్సర్ మరలా మరలా వస్తుందా అంటే మళ్లీ రాదని చెప్పలేం. ట్రీట్మెంట్ తర్వాత నెలల గ్యాప్‌తోనూ లేదా సంవత్సరాల తర్వాత కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందట. రేడియేషన్, కీమోథెరపీ ట్రీట్మెంట్ సమయంలోనో లేదంటే సర్జరీ సమయంలో కొన్ని కణాలు బతకవచ్చు. పరీక్షలు వాటిని అంతగా గుర్తించలేవు. ట్రీట్మెంట్ తర్వాత మిగిలిపోయిన ఒకే ఒక్క క్యాన్సర్ కణం కూడా మళ్లీ గడ్డ అవుతుంది. 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి మొదట రోగ నిర్ధారణ చేస్తే, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. అంతేకాకుండా, మెనోపాజ్ కి ముందు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలిసిన మహిళలకు తిరగబెట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది పెద్ద బ్రెస్ట్ గడ్డలు ఉన్న మహిళలకు తిరగబెట్టే ప్రమాదం ఉంటుంది.