Tabu Mahesh l 2 దశాబ్దాల తర్వాత మహేశ్ తో టబు..!
ప్రస్తుతం హిందీలో భూల్ భూలయ్యా 2 (Bhool Bhulaiyaa 2), మలయాళంలో భీష్మ పర్వం సినిమాలు చేస్తోంది టబు . ఈ భామ బాలీవుడ్ దర్శకనిర్మాత మహేశ్ మంజ్రేకర్ (Mahesh Manjrekar) తో కలిసి మరో సినిమా చేయనున్నట్టు బీటౌన్ లో వార్త తెరపైకి వచ్చింది.

అల వైకుంఠపురం చిత్రంతో చాలా కాలం తర్వాత తెలుగులో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చింది టబు (Tabu). ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ చాలా జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకుంటుంది. ప్రస్తుతం హిందీలో భూల్ భూలయ్యా 2 (Bhool Bhulaiyaa 2), మలయాళంలో భీష్మ పర్వం సినిమాలు చేస్తోంది. ఈ భామ బాలీవుడ్ దర్శకనిర్మాత మహేశ్ మంజ్రేకర్ (Mahesh Manjrekar) తో కలిసి మరో సినిమా చేయనున్నట్టు బీటౌన్ లో వార్త తెరపైకి వచ్చింది. ఆసక్తికర విషయమేంటంటే టబు, మహేశ్ మంజ్రేకర్ కాంబోలో సుమారు 21 ఏళ్ల తర్వాత సినిమా వస్తుండటం. వీరిద్దరూ కలిసి గతంలో అస్థిత్వ సినిమా చేశారు. ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో అవార్డు కూడా వచ్చింది.

తాజా అప్ డేట్ ప్రకారం టబు ఈ చిత్రంలో వితంతువు పాత్రలో కనిపించనుందట. ఓ మహిళ చుట్టూ తిరిగే బోల్డ్ కథాంశంతో సినిమా సాగనున్నట్టు తెలుస్తోంది. మహేశ్ మంజ్రేకర్ ప్రస్తుతం అంథిమ్..ది ఫైనల్ ట్రుత్ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, ఆయుష్ శర్మ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రగ్యాజైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
జీ స్టూడియోస్, సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు మహేశ్ మంజ్రేకర్. మరాఠి చిత్రం ముల్షీ ప్యాటర్న్ కు రీమేక్ గా వస్తోంది అంథిమ్. ఈ సినిమా పూర్తవగానే మహేశ్, టబు సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు టాక్.
ఇవి కూడా చదవండి..
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!
Aamir Khan | చిరంజీవి కోసం అమీర్ ఖాన్ స్పెషల్ షో
Gautham Menon | డాన్ లో మెరువనున్న స్టార్ డైరెక్టర్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

