Tabu | వెటరన్ నటుల లిస్ట్‌లో చేరిపోయినా టబును ఇప్పటికీ తెలుగువాళ్లు ఆరాధిస్తుంటారు. టాలీవుడ్లో టాప్‌హీరోల సరసన నటించిన ఈ భామ తాజాగా ‘ఆరోఁ మే కహా దమ్ థా’ సినిమాలో అజయ్ దేవ్‌గణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అజయ్ దేవ్‌గణ్ గురించి టబు చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ‘అజయ్‌ని నేను చాలా గౌరవిస్తా.
నాకు చిత్ర నిర్మాతలతో ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు నా తరపున మాట్లాడటానికి అతణ్ని పిలుస్తాను. ఆయన కూడా నాతో అన్ని విషయాలను షేర్ చేసుకుంటారు. అంతేకాదు నాతో కలిసి పనిచేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. మేము ఎంత క్లోజ్‌గా ఉన్నప్పటికీ నా నిర్ణయాలలో ఎప్పుడూ జోక్యం చేసుకోరు. ఒకరిని ప్రభావితం చేయడానికి అజయ్ ప్రయత్నించరు.
ఆయన ప్రతి ఒక్కరినీ గౌరవిస్తారు. ఇక, అజయ్ నా సోదరుడికి చిన్ననాటి స్నేహితుడు. సినిమాల్లోకి రాకముందే అజయ్ నాకు తెలుసు. ఆయన పెండ్లయ్యాక కూడా మా స్నేహంలో ఎలాంటి మార్పూ రాలేదు. సినిమాలంటే అజయ్‌కు చాలా ఇష్టం. అయితే, ఆయన దర్శకుడు కావాలని అనుకున్నారు’ అని చెప్పుకొచ్చింది సీనియర్ హీరోయిన్ టబు.