Puri Jagannadh – Tabu | టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రస్తుతం తమిళ నటుడు విజయ్ సేతుపతితో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు పోకిరి, దేశముదురు, అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి వంటి బ్లాక్ బస్టర్లతో పాటు ఇండస్ట్రీ హిట్లను అందించిన పూరి ప్రస్తుతం సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే విజయ్‌తో చేతులు కలిపాడు. ‘పూరి కనెక్ట్స్’ ఈ సినిమాను నిర్మించనుండగా.. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు తెలిపింది. రెగ్యులర్ షూటింగ్ జూన్ లో ప్రారంభమవుతుందని వెల్లడించింది. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇస్తామని తెలిపింది. ఈ సినిమాకు సినీ నటి చార్మి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అయితే ఈ మూవీలో హీరోయిన్‌కి సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టబుకి నెగటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్రను పూరి ఆఫర్ చేసినట్లు సమాచారం. దీనిపై టబు కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.