Taapsee Pannu | సౌత్, నార్త్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను (Taapsee Pannu). బాలీవుడ్ లో కథానాయిక ప్రాధాన్యం ఉన్న పాత్రలకు ముందు వరుసలో ఉంటుంది. తెర బయట సైతం ధైర్యంగా తన అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తుంటుందన్న పేరుంది ఆమెకు. ప్రస్తుతం తాప్సీ ‘డంకీ’, ‘ఏలియన్’ తదితర చిత్రాల్లో నటిస్తోంది. కాగా, చాలా కాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న తాప్సీ.. సోమవారం తన అభిమానులతో సరదాగా ముచ్చటించింది. ఈ సందర్భంగా తాప్సీని పలువురు నెటిజన్లు ఆసక్తికర ప్రశ్నలు వేశారు.
ఓ నెటిజన్ ‘మీ పెళ్లి (Marriage) ఎప్పుడు..?’ అంటూ ప్రశ్నించారు. దీనికి తాప్సీ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చింది. ‘నేనింకా ప్రెగ్నెంట్ కాలేదు. కాబట్టి, అతి త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు’ అంటూ చాలా బోల్డ్ గా సమాధానమిచ్చింది. దీంతో తాప్సీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read..
Deepika Padukone | ప్రాజెక్ట్-K నుంచి దీపికా పదుకొనె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
Heart Surgery | రోజుల బిడ్డకు గుండె ఆపరేషనా? పసిబిడ్డకు శస్త్రచికిత్స అవసరమా?
Commonwealth Games: 2026 కామన్వెల్త్ క్రీడలు రద్దు