Commonwealth Games: 2026 కామన్వెల్త్ క్రీడలు రద్దు
Commonwealth Games: 2026లో జరగాల్సిన కామన్వెల్త్ క్రీడలను రద్దు చేశారు. విక్టోరియా రాష్ట్రం ఆ క్రీడలను నిర్వహించేందుకు విముఖత చూపించింది. క్రీడల కోసం ఖర్చు మూడింతలు పెరిగినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. దాని వల్లే ఆ క్రీడల్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో 2026లో జరగాల్సిన కామన్వెల్త్ క్రీడల(Commonwealth Games)ను రద్దు చేశారు. విక్టోరియా రాష్ట్రం ఆ క్రీడలను నిర్వహించేందుకు వెనుకడుగు వేసింది. బడ్జెట్ కారణాల వల్ల కామన్వెల్త్ క్రీడల్ని నిర్వహించలేకపోతున్నట్లు చెప్పింది. దీంతో ఆ గేమ్స్ నిర్వహణపై సందిగ్ధం నెలకొన్నది. క్రీడా పోటీల నిర్వహణకు మరో హోస్ట్ నగరాన్ని గుర్తించలేకపోయినట్లు కామన్వెల్త్ గేమ్స్ ఫడరేషన్ పేర్కొన్నది. క్రీడల ఏర్పాట్ల కోసం చేసిన అంచనా వ్యయం మూడింతలు పెరిగిందని విక్టోరియా ప్రీమియర్ డానియల్ ఆండ్రూస్ తెలిపారు. విక్టోరియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిరుత్సాహపరిచినట్లు సీజీఎఫ్ పేర్కొన్నది. దీనికి త్వరలో పరిష్కారాన్ని కనుక్కోనున్నట్లు వెల్లడించింది.
కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు తొలుత 2 బిలియన్ల డాలర్లు అవుతుందని విక్టోరియా ప్రభుత్వం భావించింది. కానీ ఆ క్రీడల నిర్వహణ కోసం సుమారు 7 బిలియన్ల డాలర్లు అవసరం వచ్చేలా ఉందని విక్టోరియా ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే ఇంత మొత్తంలో అమౌంట్‌ను కేవలం క్రీడల కోసం వచ్చించడం అవసరం లేదన్న నిర్ణయానికి వచ్చినట్లు ఆండ్రూస్ తెలిపారు. మూడింతల ఖర్చు పెరిగే క్రీడల కోసం హాస్పిటళ్లు, స్కూళ్లకు పెట్టాల్సిన డబ్బును తీసేయలేమన్నారు. 2026 క్రీడలను విక్టోరియాలో నిర్వహించడం లేదని చెప్పామన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

