‘డంకీ’ నా కెరీర్లోనే స్పెషల్ మూవీ. నేను ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న అదృష్టం. థియేటర్లో ఆడియన్స్‌తో కలిసి చూస్తాను’ అంటున్నది అందాలభామ తాప్సీ. రేపు ఆమె నటిస్తున్న ‘డంకీ’ విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడింది. ‘నేను రాజ్‌కుమార్ హిరాణీ సార్‌కి వీరాభిమానిని. ఆయనవి సినిమాలు కావు. జీవితాలు. చేసిన సినిమాలన్నీ అద్భుతాలే. అందుకే ఆయనతో పనిచేయడం అంటే ఇష్టం.
ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. ఇందులో నాది మంచి పాత్ర. హైలీ ఎమోషన్స్‌తో కూడిన పాత్ర. ఈ సినిమాలో పాత్రలు పడే అంతర్మథనం తెరపై చూస్తేనే తెలుస్తుంది. రాజ్‌కుమార్ సార్ సినిమాలు సందేశాత్మకంగా, సబ్జెక్ట్ ఓరియెంటెడ్‌గా సాగినా వసూళ్ల పరంగా రికార్డులు తిరగరాస్తాయి. గతంలో వచ్చిన సినిమాలే అందుకే నిదర్శనం. ఈ సినిమాకు కూడా కచ్చితంగా కమర్షియల్‌గా కూడా సెన్సేషన్ సృష్టించడం ఖాయం. ఇందులో షారుఖ్. విక్కీ కౌశల్, బొమ్మన్సార్ ఇలా అందరూ గొప్పనటులే. గొప్ప దర్శకుడు చేసిన సినిమాలో గొప్ప నటులతో కలిసి పనిచేయడం ఓ గొప్ప అచీవ్మెంట్ నాకు. ఆ భూమిపై నేను లేనప్పుడు.. నటిగా నా గురించి ప్రస్తావన వస్తే ‘డంకీ’లోని నా పాత్ర గురించే చెప్పుకుంటారు.’ అంటూ ఆనందం వెలిబుచ్చింది తాప్సీ.